ఘట్కేసర్, వెలుగు: సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సిటీ శివారు ప్రాంతాల్లో మనీ హంటింగ్ పేరుతో పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. తాజాగా ఓఆర్ఆర్ పై 9వ ఎగ్జిట్ వద్ద ఓ వ్యక్తి నిలబడి, తన చేతుల్లో ఉన్న రూ.20 వేల నోట్ల కట్టను చెట్ల పొదల్లో పడేశాడు. ఎవరైనా వచ్చి ఆ పైసలు తీసుకోవాలని ఆఫర్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అధిక స్పీడ్ లిమిట్ ఉన్న రోడ్డుపై ఈ పిచ్చి చేష్టలు ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరోవైపు, ఈ విషయం తమ దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఘట్కేసర్ సీఐ పరుశురాం తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.