నా ఫొటోనే తీస్తావా .. ట్రాఫిక్ హోంగార్డును బూతులు తిట్టిన బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్​ భర్త

  • పేట్ బషీరాబాద్ ​పీఎస్​లో కేసు

జీడిమెట్ల, వెలుగు: మద్యం తాగి హెల్మెట్ ​లేకుండా రాంగ్​ రూట్​లో వెళ్లడమే కాకుండా ట్రాఫిక్​ హోమ్ ​గార్డును బూతులు తిట్టిన బీఆర్ఎస్ నేతపై పేట్​బషీరాబాద్​ పీఎస్​లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ట్రాఫిక్ ​పీఎస్​కు చెందిన హోంగార్డు ఎ.బాల్​దాస్​ఆదివారం సాయంత్రం అపర్ణ గ్రీన్ ​స్పేస్​వద్ద డ్యూటీ చేస్తున్నాడు.  తన విధుల్లో భాగంగా రాంగ్​రూట్​లో వస్తున్న వాహనదారుల ఫొటోలు తీస్తున్నాడు. అదే సమయంలో బైక్​పై హెల్మెట్​లేకుండా రాంగ్​రూట్​లో వస్తున్న  కొంపల్లి 12 వార్డు కౌన్సిలర్​ శిరీష భర్త, బీఆర్ఎస్ కు చెందిన నేత ప్రవీణ్​రావు ఫొటో తీశాడు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ప్రవీణ్​‘నా  ఫొటోనే తీస్తావా? నేను కౌన్సిలర్​ను’ అంటూ హోంగార్డును బూతులు తిట్టాడు. 

పోలీసులు అతనికి డ్రంక్​ అండ్ ​ డ్రైవ్​టెస్ట్​ నిర్వహించగా, 96 ఎంజీ వచ్చింది. మద్యంసేవించి నిర్లక్ష్యంగా బండి నడపడమే కాకుండా హోంగార్డు విధులను అడ్డుకొని అసభ్య పదజాలంతో దూషించినందుకు నిందితుడిపై పేట్​బషీరాబాద్​పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్​రావుపై గతంలో ఓ విలేకరిని బెదిరించిన  కేసుతోపాటు పలు కేసులు ఉన్నట్లు సమాచారం.