వైసీపీ ప్రధాన కార్యదర్శి, సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి [పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఏజెంట్ల అవగాహనా సదస్సులో సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
మనకు అనుకూలంగా అవతలి వాళ్ల ఆటలు సాగనివ్వకుండా రూల్స్ వాడుకోవాలని, అవసరమైతే ఎంతవరకైనా ఫైట్ చేసేలా ఏజెంట్లు సిద్ధం కావాలని అన్నారు సజ్జల. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని, అంతే తప్ప రూల్ ఉంది కదా అని దాని ప్రకారం పోదామని కూర్చోకూడదని అన్నారు సజ్జల. పొరపాటున ఒకటి వాదించినా పర్లేదు కానీ, రూల్ కాదని వెనక్కి తగ్గేవాడు ఏజెంట్ గా అవసరం లేదని అన్నారు.