అక్రమ వసూళ్లకు పాల్పడిన యూట్యూబర్ పై కేసు

ఘట్ కేసర్, వెలుగు: అక్రమంగా వసూళ్లకు పాల్పడిన ఓ యూట్యూబర్ పై కేసు నమోదైంది. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ సైదులు తెలిపిన  ప్రకారం.. అంకుషాపూర్ కు  చెందిన కన్నెబోయిన రమేష్  ఘట్ కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్ సీ నగర్ శివారులో 190 గజాల స్థలంలో పర్మిషన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటున్నాడు. నాగారం మున్సిపాలిటీ పరిధి రాంపల్లి కి చెందిన 3 ఎన్ యూట్యూబ్ చానల్ జిల్లా రిపోర్టర్ దినేష్ కుమార్ గత మార్చి31న రమేష్ నిర్మించే ఇంటి వద్దకు వెళ్లాడు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నావని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, మున్సిపల్ పర్మిషన్ తీసుకునే నిర్మిస్తున్నానని రమేష్  చెప్పాడు.  రూల్స్ కు విరుద్ధంగా షటర్ నిర్మించావని, రూ.20 వేలు ఇవ్వాలని లేదంటే అధికారులకు చెప్పి కూల్చేయిస్తానని దినేష్ కుమార్ హెచ్చరించాడు. దీంతో బాధితుడు ఘట్ కేసర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు.