ఓ క్రికెటర్ తన కూతరుకు స్టేడియం పేరు పెట్టుకున్నాడు. అదీ కూడా భారత్‌కు చెందిన క్రికెట్ స్టేడియం పేరును తనకు పుట్టిన బిడ్డకు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వెస్టిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వైట్ భార్య ఈనెల 6న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అతను తన ఇన్ స్టా వేదికగా అభిమానులకు తెలిపాడు. అయితే తమ కుమార్తెకు కోల్ కతాలోని క్రికెట్ మైదానం 'ఈడెన్ గార్డెన్స్`లో ఈడెన్ ను తీసుకుని ఈడెన్ రోజ్ అని పేరు పెట్టినట్టు చెప్పాడు. అలాగే ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా బ్రాత్ వివరించాడు.
బ్రాత్ వైట్ 2016 ప్రపంచకప్ ఫైనల్లో ఈడెన్ గార్డెన్ స్లోనే నాలుగు సిక్సులు కొట్టి తమ జట్టుకు ప్రపంచకప్ అందించాడు. ఈడెన్ గార్డెన్స్.. తనకు పేరు తెచ్చిందని అందుకే తమ చిన్నారి పేరులో ఈడెన్ అని చేర్చినట్టు చెప్పాడు. అలాగే తన కూతురితో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ఈడెన్ రోజ్ బ్రాత్‌వైట్ పేరును గుర్తుంచుకో. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తానని ఈ నాన్న వాగ్దానం చేస్తున్నాడు. థాంక్యూ జెస్సీ. నువ్వు దృఢంగా ఉన్నావ్.. అలాగే ఉంటావు కూడా. నువ్వు అద్భుతమైన తల్లి అవుతావని నాకు తెలుసు. మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను` అని బ్రాత్ వైట్ తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు.
ఇవి కూడా చదవండి:
