కేర్ హాస్పిటల్స్ నెట్‌‌వర్క్‌‌లోకి యునైటెడ్‌‌ సిగ్మా హాస్పిటల్స్‌‌

కేర్ హాస్పిటల్స్ నెట్‌‌వర్క్‌‌లోకి యునైటెడ్‌‌ సిగ్మా హాస్పిటల్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఔరంగాబాద్‌‌కి చెందిన యునైటెడ్‌‌ సిగ్మా (సీఐఐజీఎంఏ) హాస్పిటల్స్‌‌తో కేర్ హాస్పిటల్స్‌ స్ట్రాటజిక్‌‌ పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకుంది. దీంతో మహారాష్ట్రలో కూడా విస్తరించాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు హాస్పిటల్స్ మధ్య ఒప్పందం కుదిరింది. తాజా ఇన్వెస్ట్‌‌మెంట్‌‌తో యునైటెడ్‌‌ సిగ్మా హాస్పిటల్స్‌‌లో మెజారిటీ వాటా కేర్ హాస్పిటల్స్‌‌కు దక్కుతుంది. దీంతో మహారాష్ట్రలోని మూడు సిటీలలో కేర్ విస్తరించినట్టు అవుతుంది.

ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్‌‌ ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది సిటీలలో విస్తరించింది. మొత్తం 17 హెల్త్‌‌కేర్ ఫెసిలిటీస్‌‌ను ఏర్పాటు చేసింది. కేర్ హాస్పిటల్స్ నెట్‌‌వర్క్‌‌లోకి యునైటెడ్‌‌ సిగ్మా హాస్పిటల్స్‌‌ చేరడం ఆనందంగా ఉందని కేర్ హాస్పిటల్స్‌‌ గ్రూప్‌‌ సీఈఓ జస్‌‌దీప్‌‌ సింగ్ అన్నారు. మహారాష్ట్రలో విస్తరించడానికి ఈ స్ట్రాటజిక్‌‌ పార్టనర్‌‌‌‌షిప్ సాయపడుతుందని చెప్పారు.