ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రక్కు.. కారును ఢీకొనడంతో కారులోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఆగ్రా- లక్నో ఎక్స్‌ప్రెస్ వే హైవేపై ఖండౌలి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరిగింది.
https://www.v6velugu.com/wp-content/uploads/2020/12/BwKdNBeXWZ_d6dwj.mp4
నాగాలాండ్‌కు చెందిన ట్రక్కు హైవేపై రాంగ్‌రూట్‌లో వచ్చి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు అధికవేగంతో రావడం మరియు ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో కారు డోర్లన్నీ లాక్ అయి బిగుసుకుపోయాయి. దాంతో కారులోని వారెవరూ బయటకు రాలేకపోయారు. అంతలోనే కారుకు మంటలు అంటుకొని.. అందులో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ సంఘటనాస్థలం నుంచి పారిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో ట్రక్కు నుంచి కారును విడదీసి.. మృతదేహాలను బయటకు తీశారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా లక్నో నుంచి వస్తున్నారని.. వారు ఢిల్లీ వైపు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు, ఒక శిశువు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
https://www.v6velugu.com/wp-content/uploads/2020/12/TwiJ5ux3SbCDgtG3.mp4
