కారు భీభత్సం.. బైక్ ను ఢీకొట్టి బోల్తా.. స్పాట్లోనే ఇద్దరు మృతి

మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. బైక్ ను ఢీకొట్టిన తర్వాత డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వెళ్తున్న బస్సును ఢీకొట్టబోగా.. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పొదల్లోకి మళ్ళించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తో సహా 10మంది ప్రయాణికులతకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం  సమీప ఆస్పత్రికి తరలించారు. 

శామీర్ పేట్ మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ గాడి మలక్ పేటలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టు మార్టమ్ కు తరలించారు.