తిరుమల ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న కారు..

తిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ లో 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం తిరుమల నుండి తిరుపతి వెలుతుండగా కారు అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్దుర మత్తు వల్లే ఈ  ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.