అదుపుతప్పి 8 పల్టీలు కొట్టిన కారు..కారులోని ఐదుగురూ సేఫ్

బికనేర్: రాజస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో చావు అంచులదాకా వెళ్లిన ఐదుగురు వ్యక్తులు బతికి బట్టకట్టారు. కారు అదుపుతప్పి 8 పల్టీలు కొట్టినా.. డ్రైవర్​సహా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సురక్షితంగా ఉన్నారు. యాక్సిడెంట్ అనంతరం లేచి, వారు టీ కావాలని అడగడం అందరినీ ఆశ్చర్చపరిచింది. రాజస్థాన్‌‌‌‌లోని నాగౌర్‌‌‌‌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదంం జరిగింది. 

ఇదే ప్రాంతానికి చెందిన ఓ ఐదుగురు వ్యక్తులు ఎస్ యూవీ కారులో బికనేర్‌‌‌‌ బయల్దేరారు. మార్గమధ్యంలో టర్న్​ తీసుకునేటప్పుడు డ్రైవర్ ​కారుపై పట్టు కోల్పోయాడు. దీంతో అదుపుతప్పిన కారు సెకన్ల వ్యవధిలోనే 8 సార్లు పల్టీలు కొడుతూ.. పక్కనే ఉన్న ఓ కారు షోరూమ్‌‌‌‌ గేటుపై బోల్తాపడింది. కారు పల్టీలు కొడుతున్నప్పుడే మొదట డ్రైవర్.. ఆ తర్వాత మిగతావారు కిందికి దూకేశారు. అనంతరం ఆ ఐదుగురు కారు షోరూమ్​లోకి వెళ్లి తమకు టీ తాగించాలని అక్కడున్నవారిని అడిగారు. దీంతో షో రూం సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియో చూసినవారందరూ వారికి ఇంకా భూమ్మీదనూకలున్నాయ్​ అంటూ కామెంట్​ చేస్తున్నారు.