కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది

డ్రైవర్ నిర్లక్ష్యం ఖరీదు..అప్పటివరకు కేరింతలు కొడుతున్న ఆడుతున్న చిన్నారి..అంతలోనే కదలకుండా పడి ఉంది. కళ్లముందే పాప గిలగిల కొట్టుకుంటుంటే తల్లడిల్లిపోయారు అక్కడున్న వారంతా. అతివేగంగా దూసుకొచ్చిన కారు రెండేళ్ల చిన్నారిని కబలించింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే అంతా అయిపోయింది..రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో ఓ చిన్నారి మృతి చెందింది.

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని  అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఢీకొట్టడంతో మూడేళ్ల బాలమ్మ అనే చిన్నారిని మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన బాల వెంకటమ్మ,చిన్న తిరుపతయ్య గత పదేళ్లుగా భూపేష్ గుప్తా నగర్ లో జీవనం కొనసాగిస్తున్నారు. బాలవెంకటమ్మ, చిన్న తిరుపతయ్య కుమార్తు బాలమ్మ ఇంటి ముందుకు ఆడుకుంటుండగా కారు ఢీకొట్టింది. కళ్లముందు బిడ్డ  మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరు విలపించారు. యాక్సిడెంట్ చేసి పారిపోతున్న డ్రైవర్ నుపట్టు కొని పోలీసులకు అప్పగించారు స్థానికులు.