వరంగల్- ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా : దాంతలపల్లి మండల శివారులో వరంగల్,- ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మృతి  చినిపోయారు. మరో ముగ్గురి పరిస్థిరి విషమంగా ఉంది. మృతులు బుక్య వాల్య తండా చెందిన నరేష్, బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కొమురయ్య, మరోవ్యక్తి వేలికట్ట గ్రామవాసి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మంజుల, అంజలి, అక్షయ అనే ముగ్గిరి పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రాంనాద్ కేకన్ సందర్శించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.