కీసర ఐటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం.. విమాన పైలట్ మృతి

మేడ్చల్ జిల్లాలో సోమవారం (జూలై 8) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందారు. కీసర పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డు పై కారు అదుపు తప్పిన బోల్తా పడింది. 

ఈ ఘటనలో శిక్షణలో ఉన్న విమాన పైలట్ శ్రీకరన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న శ్రీకరన్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శ్రీకరన్ రెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్.