Rohit Sharma: హిట్‌‌మ్యాన్‌ చాలా గొప్పోడయ్యా.. బిజీ రోడ్డుపై కారు ఆపి అభిమానికి బర్త్‌డే విషెస్‌

భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. తన ఖరీదైన లంబోర్గిని కారులో ముంబై వీధుల్లో సందడి చేసిన హిట్‌‌మ్యాన్‌.. బిజీ రోడ్డుపై కారు ఆపి మహిళా అభిమానికి బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. ఆ సమయంలో సదరు మహిళా అభిమాని సంతోషం చూడాలి. చిరునవ్వుతో ఆమె మొహం వెలిగిపోయింది.

బంగ్లాదేశ్‪తో టెస్ట్ సిరీస్ అనంతరం హిట్‌‌మ్యాన్‌ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. ఈమధ్యనే దుబాయ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. నడిరోడ్డుపై అభిమానుల కంట పడ్డాడు. వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి రోహిత్.. రోహిత్ అంటూ కేరింతలు కొట్టారు. వారి కోసం కారు ఆపిన హిట్‌‌మ్యాన్‌.. ఓ మహిళా అభిమాని బర్త్‌డే అని తెలుసుకొని ఆమెకు విషెస్‌ తెలిపాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

ALSO READ | IND vs SL: మా కెప్టెన్ ఫిట్‌గా బాగానే ఉంది: స్మృతి మంధాన