అది పునర్జన్మ లాంటి అనుభూతి : రోహిత్ శర్మ

ముంబై : టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలవడంతో తనకు పునర్జన్మ లాంటి అనుభూతి కలిగిందని టీమిండియా కెప్టెన్‌‌‌‌ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది రోహిత్ కెప్టెన్సీలోని ఇండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌‌‌‌ ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశకు గురైన తర్వాత సౌతాఫ్రికాలో  టీ20 కప్పు నెగ్గిన జట్టు తమ కలను నెరవేర్చుకుంది.  

‘టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ముందు 3-–4 నెలలు మా అందరి అతి పెద్ద లక్ష్యం ఒక్కటే. ఆ కప్పు గెలవడం. వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన తర్వాత నా జీవితానికి మళ్లీ ప్రాణం వచ్చినట్టు అనిపించింది’ అని ముంబైలో గురువారం ఓ క్రికెట్ అకాడమీ ఓపెనింగ్‌‌‌‌ సెర్మనీలో రోహిత్ పేర్కొన్నాడు.

ALSO READ | ఇరానీ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈశ్వరన్ సెంచరీ