మూడో వన్డేలో బ్రూక్‌‌‌‌‌‌‌‌ సెంచరీ

చెస్ట్‌‌‌‌‌‌‌‌ లీ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ : ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌ (94 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 110 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీకి తోడు విల్‌‌‌‌‌‌‌‌ జాక్స్‌‌‌‌‌‌‌‌ (84) దుమ్మురేపడంతో.. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 46 రన్స్‌‌‌‌‌‌‌‌ (డక్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌) తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 304/7 స్కోరు చేసింది. 

అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ (77 నాటౌట్‌‌‌‌‌‌‌‌), స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (60), ఆరోన్‌‌‌‌‌‌‌‌ హ్యార్డీ (44), కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (42), మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (30) రాణించారు. ఆర్చర్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 37.4 ఓవర్లలో 254/4 స్కోరు చేసింది. ఈ దశలో భారీ వర్షంతో మ్యాచ్ నిలిచిపోగా..  డక్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ లూయిస్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను విన్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించారు. బ్రూక్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే శుక్రవారం లార్డ్స్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది.