కరోనా కష్టకాలంలో భారీగా పెరిగిన జీతాలు

కరోనా కష్టకాలంలో భారీగా పెరిగిన జీతాలు

కరోనా వైరస్ కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగుల భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. లాక్ డౌన్ తో పలు ప్రైవేట్ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల్ని తొలగించడం..? సగానికి సగం జీతాల్ని తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  ఉద్యోగులు మాత్రం వచ్చే జీతం సరిపోతుందని, శాలరీలు పెంచాల్సిన అవసరం లేదని, ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఫ్రెంచ్ కు చెందిన క్యాప్ జెమినీ సంస్థ తమ ఉద్యోగస్థుల జీతాల్ని 70శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.  అంతేకాదు కరోనా కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగస్థులకు రూ.10వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు క్యాప్ జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డి తెలిపారు. బెంచ్ లో ఉన్న ఉద్యోగస్థుల జీతాల చెల్లింపులు,  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి కూడా షిఫ్ట్ అలవెన్స్ లు , ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటించనుంది కంపెనీ. జూలై 1 నుంచి అమలులోకి వస్తున్నట్లు అశ్విన్ యార్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ తో జరిగే నష్టం గురించి ఆలోచించడంలేదు. కానీ మా సంస్థను ఎలా అభివృద్ధి చేయాలి.ఆర్ధిక స్థితిగతులపై మాకో స్పష్టమైన అవగాహన ఉంది.  ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలనే అంశాలపై ఎలాంటి చర్చలు జరగలేదని యార్ఢి హామీ ఇచ్చారు.