ఇప్పటికైనా మారండి: కేకుల తయారీపై బేకరీలకు ప్రభుత్వం వార్నింగ్

కేకుల తయారీ బేకరీలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కేకుల తయారీ ప్రాణాంతకమైన రోగాలకు కారణమయ్యే పదార్థాలను వాడుతున్నారని..పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలోని కొన్ని బేకరీల్లో కేకుల తయారీలో ప్రాణాంతకమైన క్యాన్సర్ కు కారణమైన పదార్థాలు వాడుతున్నారని గుర్తించిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ డిపార్టుమెంట్ బేకరీల యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 

రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసిన కర్ణాటక ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ శాఖ అధికారులు..కొన్ని బేకరీలు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో సేకరించిన కబాబ్‌లు, మంచూరియన్, పానీ పూరీ వంటి ఆహార పదార్థాల శాంపిల్స్‌లో కార్సినోజెన్స్ అనే క్యాన్సర్ కారక పదార్ధాలున్నట్లు గుర్తించారు. అయితే ఇది రెండు నెలల క్రితం జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆగస్టులో కర్ణాటకలోని పలు బేకరీలపై దాడులు నిర్వహించింది అక్కడి ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్టుమెంట్. 235 రకాల కేకుల శాంపిల్ష్ సేకరించిన ల్యాబ్ టెస్ట్ చేసింది. కేకుల తయారీలో మొత్తం 12 రకాల కృత్రిమ రంగులు కలుపుతున్నారని.. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని తేల్చింది. 

Also Read : నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!

కృత్రిమ రంగులైన అల్లూరా రెడ్, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సిఎఫ్, పోన్సీయు 4ఆర్ (స్ట్రాబెర్రీ రెడ్), టార్ట్రాజైన్ (నిమ్మ పసుపు), కార్మోయిసిన్ (మెరూన్) వంటి వాటిని కలపాల్సిన దానికంటే ఎక్కువ కలిపితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించింది. అంతేకాదు.. మానసిక, శారీరక ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపింది.  బేకరీలు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. 

ప్రజలు కంటికి ఆకట్టుకునే కలర్లను ఇష్టపడుతుండటంతో హోటళ్లు, బేకరీలు, వీధుల్లో దొరికే  ప్యాక్ చేసిన ఫుడ్ లో కృత్రిమ రంగులను కలుపుతున్నారు. వీటిలో టైటానియం డయాక్సైడ్ ఉంటుంది. ఇది మన దేశంలో అనుమతించారు కానీ..యూరప్ వంటి అనేక మధ్య ప్రాచ్య దేశాల్లో నిషేధించారు. ఇది తినే పదార్థాల్లో కలిపితే హానికరం కాబట్టి ఆహార పదార్థాల్లో ఇటువంటి పదార్థాలను నిషేంధించాలని ఫుడ్ సేఫ్టీ ప్రచార కర్తలు కోరుతున్నారు.