కరోనా కల్లోలానికి ప్రముఖ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ రద్దైంది. ఈ విషయాన్ని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్, ఛాంపియన్ షిఫ్ నిర్వహణ కమిటీలు తెలిపారు. ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సిన ఈ టోర్ని కరోనాతో రద్దు అవుతున్న టోర్నీల లిస్టులో జాబితాలో చేరింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ టోర్నీ వాయిదా పడడం ఇది మొదటి సారి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ టోర్నీని రద్దు చేస్తున్నాము… వచే ఏడాది జూన్ 28 నుంచి జూలై 11 మధ్య ఈ టోర్నిని నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటి ప్రకటించింది.
