డబ్బులు ఇవ్వండి.. హిందూ దేవాలయాలను కాపాడతాం

డబ్బులు ఇస్తేనే మిమ్మల్ని, మీ దేవాలయాలను కాపాడుతాం.. లేదంటే మాకు ఏం సంబంధం లేదంటున్నారు కెనడాలో పోలీసులు. కెనడాలోని అడ్మినిస్ట్రేషన్ అక్కడి హిందూవులకు రక్షణ కల్పించడానికి డబ్బులు డిమాండ్ చేస్తోందని ఇంటెలిజెన్స్ ఉన్నత వర్గాలు తెలిపాయి. కెనడాలోని పోలీసులను డబ్బు అడగడంపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని వర్గాలు తెలిపాయి.

హిందూ గ్రూపులకు రక్షణ కల్పించేందుకు కెనడా పోలీసులు 70వేల డాలర్లు డిమాండ్ చేశారని ఆరోపనలు వస్తున్నాయి. కెనడియన్ హిందూ సంస్థలు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పౌర హక్కులను దుర్వినియోగం చేస్తోందని అంటున్నాయి. కెనడాలో హిందువుల వేడుకలు, మీటింగులపై నిషేదాలు విధించాలని ఖలిస్తానీ గ్రూపుల నుంచి పరిపాలనపై ఒత్తిడి వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 

సిక్కులు ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కెనడాలో హిందూ ఆలయాలపై దాడుల చేస్తామని కూడా ప్రకటించాడు. హిందూ ఎంపీ చందన్ ఆర్యకు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు. నవంబర్ 16,-17 తేదీలలో హిందూ దేవాలయాలు, భారతీయ దౌత్యవేత్తలను SFJ లక్ష్యంగా దాడులు చేస్తామని బెదిరించాడు. ఈ క్రమంలో హిందూ దేవాలయాలను కాపాడటానికి కెనడా పరిపాలనా, పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని సమాచారం.