Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!

'జ్వరం వచ్చిందా?.. అయితే, నాన్వెజ్ తినొద్దు' అనే మాటలు చాలాసార్లు వినే ఉంటరు. అసలు ఆ టైంలో నాన్వెజ్ తినాలా? వద్దా? అనే సందేహం అందరినీ వేధిస్తది. కొంతమంది డాక్టర్లు తినమంటరు. కొంతమందేమో 'నో.. నో.. నాన్వెజ్ ముట్టొద్దు' అని హెచ్చరిస్తరు. 'అసలు జ్వరం వచ్చినప్పుడు నాన్వెజ్ తింటే ఏమైతది?” వెంటనే “పస్కలైతయ్' అని డాక్టర్ కోర్సు చెయ్యకున్నా టక్కున ఆన్సర్ చెప్పెస్తరు.

ఇంతకీ జ్వరం వచ్చినప్పుడు ఏమైతదో తెలిస్తే.. ఏం తినాలో.. తినొద్దో మీరే డిసైడ్ చేసుకోవచ్చు! జ్వరం వచ్చినప్పుడు జీర్ణశక్తి తగ్గిపోతది. జ్వరం తీవ్రంగా ఉంటే లూస్ మోషన్స్ కూడా అయితుంటయ్. ఈ టైంలో కష్టంగా జీర్ణమయ్యే పదర్థాలు తింటే.. అవి శరీరం రికవరీ కాకుండా అడ్డు పడ్తాయ్. ఇది లివర్పై లోడ్ పెరిగేందుకు కారణమై తది. ఇంకేముంది లివర్ పనితీరు డౌన్ అయితది.

లివర్ ఆరోగ్యంగా లేకపోతే వెంటనే వచ్చే మొదటి సమస్య పస్కలే! అందుకే మాంసాహారం ముట్టొద్దని చెప్తరు. జ్వరంలో ఉన్నప్పుడు కష్టంగా జీర్ణమయ్యే ఆయిల్ ఫుడ్స్, చిరు తిండ్లు, హోటల్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్లకు పస్కలయ్యే అవకాశాలు పుష్కలం. అంటే జ్వరంతో ఉన్నప్పుడు కష్టంగా జీర్ణమయ్యే ఏ పదార్థం తిన్నా.. లివర్పై ఒత్తిడి పడ్డది. మందు తాగినప్పు డు కూడా అంతే! లివర్పై ఒత్తిడి పడ్డది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు కష్టంగా జీర్ణ మయ్యేవి తినొద్దు. జ్వరం ఉన్నా.. నాన్వెజ్ మీదకి మనసు గుంజెటోళ్లు తేలికగా జీర్ణమయ్యే చేపలు, చికెన్ పులుసు తింటే ఏం కాదంట!