చిరుతల సంచారంపై తొలగని సందిగ్ధం

  • బూరుగుపల్లి  పొల్లాల్లో ట్రాకింగ్ కెమెరాలు, బోను ఏర్పాటు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామ శివారులో చిరుత, రెండు పిల్లల సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. మంగళవారం రాత్రి నుంచి ఫారెస్టు ఆఫీసర్లు గ్రామ శివారులో పాదముద్రల సేకరణ కోసం ప్రయత్నించారు. పాదముద్రలు గుర్తించినప్పటికీ అవి చిరుత పాదముద్రలే అని కన్ఫామ్ చేయలేకపోతున్నామని  సిద్దిపేట ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్రముద్దీన్ తెలిపారు.

 ట్రాకింగ్ కెమెరాలు, పులి బోనును ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. గ్రామస్తులు రాత్రివేళ నలుగురు, ఐదుగురు కలిసి వెళ్లాలని, ఒంటరిగా తిరగవద్దని, టార్చ్ లైట్ వెంట తీసుకెళ్లాలని సూచించారు. గ్రామస్తులకు ఎవరికైనా చిరుతలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.