ఐసోలేషన్ సెంటర్ నుంచి పారిపోయిన మహిళ
రాజమండ్రిలో పట్టుకున్న హెల్త్ స్టాఫ్
అమరావతి: లండన్ నుంచి వచ్చిన ఓ మహిళకు ఢిల్లీలోనే పాజిటివ్ అనితేలినా అధికారులకు చెప్పకుండానే ఆమె ట్రైన్లో సొంతూరు రాజమండ్రికి రావడం కలకలం రేపింది. ఢిల్లీ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ అధికారులు.. రాజమండ్రిలో బుధవారం రాత్రి ట్రైన్దిగిన వెంటనే ఆమెను పట్టుకుని స్పెషల్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.
రాజమండ్రిలో ఉండే ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీ ఓ స్కూల్లో పనిచేసేది. లాక్డౌన్లో స్కూల్స్ లేక ఆమె భర్త లండన్ వెళ్లారు. అక్కడ జాబ్ చూడడంతో ఆ మహిళ కూడా లండన్ వెళ్లగా కొడుకు ఇక్కడే ఉండిపోయాడు. కొడుకును చూసేందుకు ఈ నెల 21న లండన్‌నుంచి ఆమె ఢిల్లీ వచ్చింది. ఎయిర్ పోర్టులో అధికారులు టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను స్పెషల్ క్వారంటైన్సెంటర్కు తరలించారు. అయితే ఆమె.. ఢిల్లీలో రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన కొడుకుతో కలిసి అక్కడి అధికారులకు చెప్పకుండానే ట్రైన్లో రాజమండ్రికి వచ్చేసింది.
ఆ లోపే ఢిల్లీ క్వారంటైన్ అధికారులు ఏపీ రైల్వే పోలీసులు, హెల్త్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు బుధవారం అర్ధరాత్రి ట్రైన్ దిగిన వెంటనే వాళ్లనుపట్టుకొని క్వారంటైన్‌కు తరలించారు. ఆమెకు కొత్త స్ట్రెయిన్ వల్ల పాజిటివ్ వచ్చిందా? లేదా పాత స్ట్రెయినా? అన్నది తెలుసుకునేందుకు శాంపిల్స్‌ను పూణే ల్యాబ్‌కు పంపించారు.
