కేఫ్ లో మాస్క్ ధరిస్తే భారీ జరిమానా

కేఫ్ లో మాస్క్ ధరిస్తే భారీ జరిమానా

కరోనా కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలి. లేదంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇది ప్రస్తుతం అంతటా కామన్ గా జరిగేది. అయితే ఓ కేఫ్‌లో మాత్రం మాస్క్‌ ధరిస్తే భారీగా జరిమానా విధిస్తున్నారు. ఈ వింతైన రూల్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగింది. ఫిడిల్‌హెడ్స్‌ కేఫ్‌లో మాస్క్‌ ధరిస్తే ఆ యజమాని ఐదు డాలర్ల జరిమానా విధిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ కస్టమర్లకు గమనిక అంటూ కేఫ్ గోడలపై బోర్డు ఏర్పాటు చేశాడు.

మాస్క్‌ ధరించి ఆర్డర్‌ చేస్తే వారికి ఐదు డాలర్లు.. టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా చెప్పుకుంటే అదనంగా మరో ఐదు డాలర్లు ఫైన్‌ విధించబడును అంటూ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేశాడు. ఆ బోర్డును చూపించి మరీ కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్నాడట. ఓ స్వచ్ఛంద సంస్థకు చేయూతను అందించేందుకోసమే తాను ఫైన్లు విధించడానికి కారణంగా ఆ కేఫ్ యజమాని చెప్పాడట. దీంతో కేఫ్ కు వచ్చే కస్టమర్లు కూడా ఆ సంస్థ కోసం పోటీపడి ఫైన్లు చెల్లిస్తున్నారట.