జములమ్మ హుండీ లెక్కింపు

గద్వాల టౌన్, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారు, పరశురామస్వామి ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించినట్లు ఎండోమెంట్  ఆఫీసర్లు వెంకటేశ్వరమ్మ, పురేందర్, ఆలయ కమిటీ చైర్మన్  గాయత్రి తెలిపారు. 45 రోజుల హుండీ ఆదాయం రూ.27,28,309 వచ్చినట్లు వారు చెప్పారు. మిశ్రమ బంగారం 28 గ్రాములు, మిశ్రమ వెండి 12 కేజీల 200 గ్రాములు వచ్చిందన్నారు.