క్యాడ్ బరీ చాక్లెట్ ఫ్లేవర్ కాంటెస్ట్-2021 ప్రారంభం

క్యాడ్ బరీ చాక్లెట్ ఫ్లేవర్ కాంటెస్ట్-2021 ప్రారంభం
  • నవంబర్ వరకు ఎంట్రీలకు ఆహ్వానం
  • 2022 ఆగస్టులో విజేతల ప్రకటన

న్యూఢిల్లీ: చాక్లెట్ల మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న క్యాడ్ బరీ చాక్లెట్ ఫ్లేవర్ కాంటెస్ట్ -2021ను లాంఛ్ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చే నవంబర్ వరకు ఆన్ లైన్ ద్వారా ఎంట్రీలు పంపుకోవచ్చు. ఈ కాంటెస్ట్ కోసం క్యాడ్ బరీ ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. గతంలో రెండుసార్లు నిర్వహించిన కాంటెస్టులు విజయవంతం కావడంతో తాజాగా లాంచ్ చేస్తున్న మూడో విడుత మ్యాడ్ బరీ మూడో ఎడిషన్ గత రెండు ఎడిషన్ల కన్నా భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించింది.

మ్యాడ్ బరీ 2021 ను వినియోగదారులకు మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, మ్యాడ్ బరీ వెబ్ సైట్ (www.madbury.in), జియో ఎంగేజ్ లకు తోడుగా మరో రెండు కొత్త వేదికలు రానున్నాయి. వాట్సాప్ మరియు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్. వినియోగదారులు తమ ఎంట్రీలను సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా సమర్పించవచ్చు. విజేతలను 2022 ఆగస్టులో ప్రకటిస్తారని సంస్థ ప్రకటించింది. 
క్యాడ్ బరీ డెయిరీ మిల్క్  రెండు కన్జ్యూమర్ క్రియేటెడ్ వేరియంట్స్ మ్యాడ్ బరీ 2021తో పాటుగా ఆవిష్కరిస్తోంది. డెయిరీ మిల్క్, బోర్నవిటా, ఓరియో లాంటి భారతదేశ అభిమాన స్నాకింగ్ బ్రాండ్లను ఉత్పత్తి చేసే మాండలెజ్ ఇండియా మ్యాడ్ బరీ క్యాంపెయిన్ మూడో ఎడిషన్ ను ప్రకటించి ‘హోమ్ వాలా’ ఫ్లేవర్ కోసం భారతదేశ మార్కెట్లో సరికొత్త పోటీకి తెరలేపింది. ‘‘కొత్త ఫ్లేవర్ తయారు చేయండి.. పేరుప్రఖ్యాతులు పొందండి..’’ అంటూ కంటెస్టెంట్లను ఉత్సాహపరుస్తోంది.

మాండలెజ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ (మార్కెటింగ్) అనిల్ విశ్వనాథన్ మాట్లా డుతూ, ‘‘గత కొన్నేళ్లుగా భారతీయ చాకొలెట్ ఉద్యమం ఊపందుకుంటోంది. భారతీయులు నూతన రుచులు, ఫ్లేవర్లతో ప్రయోగాలు చేసేందుకు ఎదురు చూస్తున్న నేపథ్యంలో 70ఏళ్లకు పైగా ఎంతగానో అభిమానిస్తున్న బ్రాండ్ గా ఉన్న మేము  ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు’ అనే క్యాంపెయిన్ తో మ్యాడ్ బరీ రూపొందించామన్నారు. వినియోగదారులు తామెంతగానో అభిమానించే క్యాడ్ బరీ చాకొలెట్ కు తమ సొంత వెర్షన్ తయారు చేసే అవకాశాన్ని ఇది అందిస్తుంది తెలిపారు. మ్యాడ్ బరీ 2021లో రాబోయే సృజనాత్మక ఫ్లేవర్ల కోసం మేం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు. గతంలో 5000కు పైగా లొకేషన్స్ నుంచి స్వాగతం పలుకుతూ ఎంట్రీలు రాగా.. ఈసారి మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.