న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏడాదిపాటు పొడిగించింది. ఐఏఎస్(డీసీఆర్బీ) రూల్స్, ఫండమెంటల్ రూల్స్ 1958లోని రూల్ 56(బీ) ప్రకారం ఆయన సర్వీసును పొడిగించినట్లు ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. రాజీవ్ గౌబా జార్ఖండ్ కేడర్ కు చెందిన1982 బ్యాచ్ఐఏఎస్ అధికారి. ఆయన పదవిని కేంద్రం పొడిగించడం ఇది మూడోసారి. 2021 లో మొదటి సారి, నిరుడు ఆగస్టులో రెండో సారి, తాజాగా గురువారం మూడోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం‑2019 రూపశిల్పిగా గౌబా గుర్తింపు పొందారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా, హోంశాఖలో అదనపు కార్యదర్శిగా కీలకమైన లెఫ్ట్ వింగ్ ఎక్స్ ట్రీమిజం విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు పలు ఇతర బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.
