157 నర్సింగ్ కాలేజీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

157 నర్సింగ్ కాలేజీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశంలో కొత్త నర్సింగ్ కాలేజీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  రూ. 1570 కోట్లతో 157  నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలకు అనుభందంగానే ఈ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. తక్కువ ధరకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నర్సింగ్ సిబ్బందిని పెంచడమే లక్ష్యమన్నారు.  పక్కా ప్రణాళికతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలోనే  పూర్తి చేస్తామని తెలిపారు.

దీంతో పాటు మెడికల్ డివైసెస్ రంగానికి సంబంధించిన పాలసీని కేబినెట్ ఆమోదించిందని చెప్పారు మన్ సూక్ మాండవీయ తెలిపారు. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో  వైద్యపరికరాల రంగం ప్రస్తుతం ఉన్న 11 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెంచడానికి సహాయపడుతుందని కేంద్రం  భావిస్తోంది. 

https://twitter.com/ANI/status/1651223989379891203