హైదరాబాద్, వెలుగు: పైసాబజార్డాట్కామ్ ద్వారా రూ.9.35 కోట్ల విలువైన హోమ్‌లోన్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ ఎంటర్ప్రెన్యూర్ తీసుకున్నారు. ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఈ లోన్ అమౌంట్ డిస్బర్స్ అయ్యిందని పైసాబజార్డాట్కామ్ పేర్కొంది. కంపెనీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో హోమ్‌లోన్ డిస్బర్స్ అవ్వడం ఇదే మొదటి సారి. ‘వివిధ ఆఫర్లను పోల్చడానికి, అందులో బెస్ట్ ఆఫర్‌ను ఎంచుకోవడానికి పైసాబజార్ సాయపడింది. అమౌంట్ ఎక్కువైనప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హోమ్‌లోన్ ప్రాసెస్ పూర్తయ్యింది’ అని ఈ లోన్‌ను తీసుకున్న నితిన్ అగర్వాల్ అన్నారు. రూ. 50 లక్షలకు పైన హోమ్లోన్ల కోసం నెలకు 10 వేలకు పైగా ఎంక్వైరీలు వస్తున్నాయన్నారు.
