2023 కల్లా 50 శాతం మార్కెట్ 5జీ ఫోన్లదే

2023 కల్లా 50 శాతం మార్కెట్ 5జీ ఫోన్లదే

న్యూఢిల్లీ: గ్లోబల్ స్మార్ట్‌‌ఫోన్ మార్ట్‌‌ మార్కెట్ 2022లో ఫుల్ రికవరీ అవుతుందని ఐడీసీ తాజా రిపోర్ట్ చెప్పింది. 2023 కల్లా సగానికి పైగా గ్లోబల్ ‌‌మార్కెట్‌ను 5జీ స్మార్ట్‌‌ఫోన్లే సొంతం చేసుకుంటాయని పేర్కొంది. కరోనా వైరస్ సవాళ్లు ఉన్నప్పటికీ అన్ని స్మార్ట్ ‌‌ఫోన్ తయారీ కంపెనీలకు 5జీ అతి ముఖ్యమైనది గా మారిందని తెలిపింది. కరోనాతో మార్కెట్ పడిపోవడంతో టాప్ వెండార్లలో చాలా మంది తమ 2020 ప్రొడక్షన్ ప్లాన్‌‌ను తగ్గించుకున్నా యని ఐడీసీ వరల్డ్వైడ్ మొబైల్ డివైజ్ ట్రాకర్స్ ప్రొగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రీత్ తెలిపారు. 4జీ తక్కువ చేసి, 2020 చివరి నుంచి 5జీ యూనిట్లు పెంచాలని అభివృద్ధి చెందిన మార్కెట్లలో చాలా ఛానల్స్‌‌ నిర్ణయించుకున్నాయి. 5జీకి ప్రస్తుతం కన్జూమర్ డిమాండ్ తక్కువ గానే ఉందని రీత్ అన్నారు.

see more news

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు

రూ.8 లక్షల ఫ్లాట్.. బిల్డర్‌కు రూ.48 లక్షల ఫైన్