వీడియో: స్కూల్ బస్సు టైర్ బరస్ట్.. గాల్లో పల్టీలు కొట్టిన డ్రైవర్

టైర్ పేలి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి.. యువకుడు సినిమాల్లో సన్నివేశాల్లో వలె  కాసేపు గాల్లో పల్టీలు కొట్టాడు. ఈ ఘటన కర్నాటకలోని ఉడిపి జాతీయ రహదారి(66)పై చోటుచేసుకుంది.

బాధితుడు అబ్దుల్‌ రజీద్‌.. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు టైర్‌కు ప్యాచ్‌ వేసే పనిలో ఉండగా, హఠాత్తుగా టైర్‌ పేలింది. పేలుడు ధాటికి సదరు యువకుడు నాలుగైదు అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. వెంటనే స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం మంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి యువకుడి చేతికి తీవ్ర గాయమైనట్లు వైద్యులు తేల్చారు. గాలి అధికంగా నింపడం వలన ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ALSO READ | పోలీస్ స్టేషన్‎పై బాంబ్ దాడి.. ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం