దుబ్బాకలో కేటీఆర్, కౌశిక్ రెడ్డిల దిష్టి బొమ్మ దహనం

దుబ్బాక, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డిల దిష్టిబొమ్మలను శుక్రవారం దుబ్బాకలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ  సందర్భంగా కాంగ్రెస్​నాయకులు మాట్లాడుతూ.. ఆడ బిడ్డలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో రుణమాఫీ, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల్లోపే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

బీఆర్ఎస్ తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, పీఏసీఎస్ వైఎస్ చైర్మన్ నరేశ్, వెంకన్న, సురేశ్, చంద్రారెడ్డి, రమేశ్, లక్ష్మి, మధు, శ్రీనివాస్, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, స్వామి, రఘు, స్వామి, బాలకిషన్ పాల్గొన్నారు.