వైస్‌‌ కెప్టెన్‌‌గా బుమ్రా

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌తో మూడు టెస్ట్‌‌ల సిరీస్‌‌కు ఇండియా టీమ్‌‌ను శుక్రవారం ప్రకటించారు. రోహిత్‌‌ శర్మ సారథ్యంలో మొత్తం 16 మందిని ఎంపిక చేశారు. బంగ్లాదేశ్‌‌ సిరీస్‌‌లో ఆడిన జట్టునే చాలా వరకు కొనసాగించారు. అయితే వైస్‌‌ కెప్టెన్‌‌గా జస్ప్రీత్‌‌ బుమ్రాకు పగ్గాలు అప్పగించారు. ఆస్ట్రేలియా టూర్‌‌లో తొలి రెండు టెస్ట్‌‌ల్లో ఒక్క మ్యాచ్‌‌కు రోహిత్‌‌కు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా బుమ్రాను రెడీ చేస్తున్నారు.

చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమీకి ప్లేస్‌‌ దక్కలేదు. అక్టోబర్‌‌ 16 నుంచి తొలి టెస్ట్‌‌ బెంగళూరులో జరుగుతుంది. తర్వాత పుణె, ముంబై రెండు, మూడో టెస్ట్‌‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.

జట్టు వివరాలు:

రోహిత్‌‌ శర్మ (కెప్టెన్‌‌), జస్ప్రీత్‌‌ బుమ్రా (వైస్‌‌ కెప్టెన్‌‌), యశస్వి జైస్వాల్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, విరాట్‌‌ కోహ్లీ, కేఎల్‌‌ రాహుల్‌‌, సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌, రిషబ్‌‌ పంత్‌‌, ధ్రువ్‌‌ జురెల్‌‌, అశ్విన్‌‌, రవీంద్ర జడేజా, అక్షర్‌‌ పటేల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌, మహ్మద్‌‌ సిరాజ్‌‌, ఆకాశ్‌‌ దీప్‌‌. ట్రావెలింగ్‌‌ రిజర్వ్: హర్షిత్‌‌ రాణా, నితీశ్‌‌ కుమార్‌‌, మయాంక్‌‌ యాదవ్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ.