Jasprit Bumrah: ఇది మాత్రం ఊహించనిది: బుమ్రాతో సమానంగా దక్షిణాఫ్రికా బౌలర్

క్రికెట్ లో యాదృచ్చికం సహజం. అయితే కొన్ని మాత్రం క్రేజీగా అనిపిస్తాయి. ప్రస్తుతం క్రికెట్ లో ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ టీ20 గణాంకాలు ఒకేలా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వీరిద్దరి అంతర్జాతీయ టీ20 గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే.. 

బుమ్రా, షమ్సీ ఇద్దరూ 70 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఆ మ్యాచ్‌ల్లో ఒక్కొక్కరు 1,509 బంతులు వేసి 89 వికెట్లు తీశారు. అయితే, బుమ్రా 69 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేయగా షమ్సీ 70 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేశాడు. ఎకానమీ విషయానికి వస్తే బుమ్రా పై చేయి సాధించాడు. ఈ భారత పేసర్ ఎకానమీ 6.27 ఉంటే..  షమ్సీ ఎకానమీ రేటు 7.39 గా ఉంది. 

ఇద్దరు రికార్డ్ ఒకేలా ఉండడంతో షమ్సీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో బుమ్రా తన రికార్డ్ ఒకేలా ఉందని..దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు.  ఇది "క్రేజీ యాదృచ్చికం" అని.. సరదాగా అనిపించినా ఇది నిజం అని ఈ సౌతాఫ్రికా స్పిన్నర్ తెలిపాడు. ఇద్దరం సరిగ్గా ఒకే మొత్తంలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడడం.. వికెట్లు, బంతులు సరిగా ఒకేలా ఉండడం నిజంగా క్రేజీ అని షమ్సీ వెల్లడించాడు. 

ALSO READ : New Zealand Cricket: కొకైన్ వాడినందుకు న్యూజిలాండ్ క్రికెటర్‌పై నిషేధం

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో షమ్సీ, బుమ్రా ఇద్దరూ ఆడలేదు. షమ్సీ జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. మరోవైపు బుమ్రా ఆస్ట్రేలియా టూర్ లో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమవుతుంది.