పాలమూరులో కల్కి బుజ్జి సందడి

పాలమూరు, వెలుగు: పాలమూరు పట్టణంలో కల్కి 2898ఏడీ సినిమాలో వినియోగించిన బుజ్జి వాహనం సందడి చేసింది. బుజ్జి వాహనాన్ని చూసేందుకు ప్రభాస్ అభిమానులు, యువకులు తరలివచ్చారు. యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కల్కి సినిమా ప్రదర్శిస్తున్న ఏవీడీ థియేటర్​లో అభిమానులను నాగ్  అశ్విన్  శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు.

తమ ఫ్యామిలీ ఇక్కడిదేనని, కల్కి సినిమాను ఆదరించడం సంతోషంగా ఉందని, ప్రభాస్  ఫ్యాన్స్ కు థ్యాంక్స్​ చెప్పారు. పార్ట్–2 సినిమాకు ఇంకా సమయం ఉందని తెలిపారు. అనంతరం డైరక్టర్  బుజ్జి వాహనంపై ఎక్కి అభివాదం చేశారు.