మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

 జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు రాకుమారుడైన బుధుడు మీన రాశిలోకి, శుక్రుడు మేషరాశిలోకి సంచారం ఈనెల 25న  జరిగింది దీని ప్రభావంవల్ల కొన్ని రాశులవారికి శుభ పరిణామాలు జరగనున్నాయి. ఇతర రాశుల్లోకి సంచారం చేయడంవల్ల వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలతో పాటు కుటుంబ సమస్యలన్నీ   పరిష్కారమవుతాయని జ్యోతిష్య నిపుణులు  చెబుతున్నారు. .  బుధుడు, శుక్రుడు స్థానచలనంతో  ఏయే రాశులవారికి ఎలా ఉండనుందో తెలుసుకుందాం. ..

 ప్రధానమైన రెండు  గ్రహాలు.. స్థాన చలనం చేశాయి.  బుధుడు మీన రాశిలోకి, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించాయి. . జ్యోతిష్యం ప్రకారం ఒక రాశిలో ఉన్న గ్రహాలు మరో రాశిలోకి సంచారం చేయడంవల్ల ప్రత్యేక ప్రభావం ఉంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితం అవుతాయి. అలాగే ఆయా రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.

మేషరాశి: బుధుడు, శుక్రుడు గ్రహాలు స్థాన చలనం వలన మేష రాశికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.  స్నేహితులకు, బంధువులకు ఎట్టి పరిస్థితిలో డబ్బు ఇవ్వవద్దు. ఎవరితోను వాదించకండి.  తోటి ఉద్యోగస్తులతో చాలా తక్కువుగా మాట్లాడండి.  ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.  అవసరమనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండంది. దాదాపు ఎక్కువ సయమం ఆధ్యాత్మిక చింతనతో గడపాలని పండితులు సూచిస్తున్నారు. 

వృషభరాశి: ఈరాశి వారికి బుధుడు, శుక్రుడు గ్రహాలు వారి వారి స్థానాలు మారడంతో వృషభరాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో కాని ... స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు...  విహార యాత్రలకు వెళతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది.  వీరికి అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి.  విద్య, ఉద్యోగ విషయాల్లో ఎలాంటి మార్పు ఉండకపోయినా.. ఉద్యోగస్తులకు.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.  విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం. ప్రేమ విషయంలో సమస్యలు ఏర్పడి కొన్ని సమస్యలకు దారితీసే  అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

మిథునరాశి:  బుధుడు.. మీనరాశిలోకి.. శుక్రుడు మేషరాశిలో ని మారడం వలన  ఈ రాశి వారికి  ఆర్థిక పురోగతి ఉంటుంది.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆర్థికంగా పలు ప్రయోజనాలు అందనున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను తిరిగి పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. అలాగే కుటుంబ సభ్యలు మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. విద్య, ఉద్యోగ విషయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూసే వారికి అనుకూల సమయం. ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి: ఈ  రాశి వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది, మీకు నచ్చిన సంస్థ నుండి మీకు ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. డబ్బు సంపాదించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి, ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుతుంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి . మీ తల్లిదండ్రులతో సమయాన్ని వెచ్చించి.. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. 

సింహ రాశి:బుధుడు, శుక్రుడు గ్రహాల స్థానాలు మారడంతో  సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ సంపాదన సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. మీ ఆదాయం తగ్గవచ్చు.. వ్యక్తిగత మరియు కుటుంబ ఖర్చులు నిర్వహించలేని స్థాయికి పెరగవచ్చు.. కష్టపడి పనిచేసినా చాలా తక్కువ సంపాదించవచ్చు. మీ ఆర్థిక ఆశలన్నీ విఫలమవుతాయి.  అయినా అనుకున్న సమయానికి అతి కష్టంపై పనులు పూర్తవుతాయి.  విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చినట్టే వచ్చి కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి.  నిరుత్సాహం చెందకుండా మీ పని మీరు చేసుకుపోండి.  దైవచింతనలో గడపండి.  మంగళవారం, శని వారం ఆంజనేయస్వామిని దర్శించండి. అంతా మంచే జరుగుతుంది .

కన్య రాశి: శుక్రుడు మేషరాశిలో సంచారం వలన కన్యారాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  జాబ్​ కోసం ప్రయత్నిస్తున్న ఇది చాలా మంచి సమయం.  మీ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. విదేశాలలో పని చేసే అవకాశాలు కూడా కనిపించవచ్చు. కెరీర్ సంతృప్తి, వ్యక్తిగత వృద్ధిని అందిస్తుంది. ఈ కాలంలో మీరు లాభదాయకమైన వ్యాపారాల ద్వారా చాలా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

తులారాశి: మీకు ఉద్యోగం ఉంటే, ఈ సమయంలో మీరు అదృష్టాన్ని, గొప్ప విజయాన్ని పొందవచ్చు. సేవా దృక్పథంతో, మంచి ఆదాయాన్ని సంపాదించడం, నిర్వహించడం సులభం. ఈ కాలం మీ జీవితంలో ఒక సంపన్న దశను సూచిస్తుంది, కాబట్టి మీ పొదుపును పెంచుకోవడం గురించి ఆలోచించండి.

వృశ్చిక రాశి: బుధుడు మీనరాశిలో సంచరించడం వలన  వృశ్చిక రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగి.. ఆదాయం తగ్గుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి, ఇది ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ఈ కాలంలో అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ప్రస్తుత ఉద్యోగం పట్ల మీ అసంతృప్తి మార్పులకు దారితీయవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయండి. వీరికి  ఈ కాలంలో చాలా పరీక్షగా ఉంటుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి.  లేకపోతే మీరు ఎక్కువ డబ్బు కోల్పోతారు. మీరు డబ్బు సంపాదించడానికి ప్రయత్నించినప్పటికీ, మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. 

ధనస్సు రాశి: బుధుడు, శుక్ర గ్రహాలు స్థాన చలనంతో ఈ రాశివారికి శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఈ రాశివారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వీరు నూతనంగా గృహయోగంతో పాటు కొత్త వాహనయోగం కూడా ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా వీరికి  అనేక లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూల సమయం. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి.

మకర రాశి :  మీనరాశిలోకి బుధుడు.. మేషరాశిలోకి శుక్రుడు స్థానం చలనం  వలన ... మకర రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో పురోగతి ఉంటుంది. పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. కుటుంబ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. సోదరులు మరియు సోదరీమణులకు మద్దతు ఇవ్వండి. వివాహం కాని వారికి సంబంధం రావచ్చు. వివాహితుల జీవితాలలో వచ్చే సమస్యలు పరిష్కారమవుతాయి. విద్య, ఉద్యోగ విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. 

కుంభ రాశి:  మీరు ఉద్యోగంలో ఉంటే, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, ప్రవర్తను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి క్షణం. అయితే, మీ ప్రయత్నాలను ఉన్నతాధికారులు అంగీకరించకపోవచ్చు. ఆర్థికంగా, మీ ఖర్చులు పెరగవచ్చు. ఈ కాలంలో పొదుపు చేయడం కష్టమవుతుంది.

మీనరాశి: బుధుడు ఈ రాశిలో  ఉన్నప్పుడు, మీ ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కావచ్చు. మీరు ఎక్కువ అవకాశాలు, సంతృప్తి కోసం కెరీర్ మార్పును పరిగణించవచ్చు. ఈ సమయంలో చెల్లింపులు, పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం నైతిక సూత్రాల ఆధారంగా బలపడుతుంది.