Astrology: సింహరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే...

సెప్టెంబర్ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. అందులో బుధుడి సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు సెప్టెంబర్ నెలలో బుధ గ్రహం రెండు సార్లు ప్రయాణిస్తుంది. సెప్టెంబర్ 4 వ తేదీన బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించాడు. సూర్యునికి సంబంధించి  సింహ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల 6 రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ అదృష్ట రాశులు ఎవరో తెలుసుకుందాం.. 

బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ వరకు సింహ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అది కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. గ్రహాల సంచారం రాశులను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. వేద పంచాంగం ప్రకారం.. బుధుడు, మేధస్సు దేవుడు తన రాశిని మార్చుకుని సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనివలన వృషభరాశి,మిథున రాశి,కర్కాటక రాశి,సింహ రాశి,వృశ్చిక రాశి, మకర రాశి వారు ఈ కాలంలో  విశేష ప్రయోజనాలను పొందుతారు.

ALSO READ | వారఫలాలు ( సౌరమానం) సెప్టెంబర్ 01 నుంచి 07 వరకు

మేషరాశి: బుధుడు సింహరాశిలో ఉండటం వలన ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. అదనపు ఆదాయానికి మార్గాలు లభిస్తాయి. మనసు చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. న్యాయ పరమైన కేసుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లేదా వేతన పెరుగు దలకు అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది

వృషభ రాశి: వృషభ రాశి వారికి ఈ బుధ సంచారం.. ఇల్లు  మరియు భూమికి సంబంధించిన విషయాలలో పురోగతి ఉంటుంది.  ఇంకా ఈ రాశివారికి  ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల నుండి ఆనందాన్ని పొందుతారు.అయితే ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  

మిథున రాశి:  బుధుడు సింహరాశిలో సంచారం వలన ...  మిథున రాశి వారికి లాభిస్తుంది. ఈ వ్యక్తులు కీర్తిని పొందుతారు. పురోగమిస్తారు. శ్రమ ఫలాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. 

కర్కాటక రాశి: సింహరాశిలో బుధ గ్రహ సంచారం వలన  కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపారంలో లాభిస్తుంది. ఈ వ్యక్తులు వ్యాపారంలో బాగా రాణిస్తారు. దీని కారణంగా చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ శక్తితో చాలా కీర్తిని పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం.  విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి.  ఉద్యోగంలో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉంది. 

సింహ రాశి: బుధుడు సంచరిస్తూ సింహ రాశిలోకి సంచారం వలన  కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందే సమయం ఇది. ఈ సమయంలో కష్టపడి పని చేస్తారు .  ప్రతిఫలంగా లాభాలను పొందుతారు. సింహ రాశి స్త్రీలకు ఈ సమయం అనుకూలం. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఈ రాశిలో బుధుడు ప్రవేశించినప్పటి నుంచి ఈ రాశివారి స్థితిగతుల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం మొదలవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమ స్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలకు బాగాడిమాండ్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశముంది.

కన్యారాశి: సింహరాశిలో బుధుడి సంచారం..  కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు ఎక్కువగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి సత్ఫలితాలు ఉంటాయి. చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 

తులారాశి: బుధుడు.. సింహరాశిలో ఉన్న ఈ కాలంలో తులా రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కష్టపడి చేసిన పనులు సఫలీకృతమవుతాయి. ఈ కాలంలో వీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి: సింహరాశిలో..  బుధ సంచారం వృశ్చిక రాశి వారికి వారి వృత్తిలో లాభిస్తుంది. పనిలో మంచి సమయం ఉంటుంది. సంతోషంగా మరియు సంతృప్తిగా అనుభూతి చెందుతారు. జీవితంలో సౌఖ్యం, విలాసం పెరుగుతాయి. ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి రావడం,మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనేక విధాలుగా రాబడిపెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడడం మొదలవుతుంది. మంచి పరిచయాలుఏర్పడతాయి.

ధనస్సురాశి: సింహరాశిలో బుధుడి సంచారం ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ కాలంలో వీరికి ధనప్రయోజనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తివ్యవహారాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి భాగ్య స్థానంలో దశమాధిపతిగా బుధుడి సంచారం వల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా అంది వస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది.వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ల వలసి వస్తుంది. ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలతో పాటురాబడి కూడా బాగా పెరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

మకర రాశి: బుధ సంచారం వలన మకర రాశి వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మేధోపరంగా బలంగా ఉంటారు. ఇది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. వ్యాపారంలో దీని నుండి చాలా లాభాలను పొందుతారు.

కుంభం: కుంభరాశి వారికి బుధ సంచారం కూడా చాలా శుభప్రదం. ఈ రాశి వారికి ఈ కాలం చాలా మంచిది. ఈ కాలంలో కుంభ రాశివారి ఆర్థిక స్థితి బాగుంటుంది. అప్పులు తీరతాయి. జీవితంలో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. వారికి ఉన్న అప్పులు తీరడంతో పాటు.. రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చేస్తాయి.   కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. సీనియర్ల సహాయం అందుతుంది. విద్యార్థులకు కూడా మంచి సమయం. ఈ కాలంలో కెరీర్‌లో విజయాలు, ప్రమోషన్‌లు అందుకుంటారు.

మీనరాశి: బుధుడు .. సింహరాశిలో  ఉన్నప్పుడు మీన రాశి వారు  ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కావచ్చు. మీరు ఎక్కువ అవకాశాలు, సంతృప్తి కోసం కెరీర్ మార్పును పరిగణించవచ్చు. ఈ సమయంలో చెల్లింపులు, పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం నైతిక సూత్రాల ఆధారంగా బలపడుతుంది.