ఎకానమీకి ఫుల్​ మీల్స్​

ఎకానమీకి ఫుల్​ మీల్స్​

భోజనం కొనుగోలు శక్తి పెరిగిందన్న ఎకనమిక్​ సర్వే

‘థాలీనామిక్స్’ పేరుతో కొత్త విధానంలో ఖర్చుల విశ్లేషణ

రాష్ట్రంలో ఫ్యామిలీ సగటున నాన్​వెజ్​ఖర్చు రూ. 40.2

వెజ్ మీల్స్కొనుగోలు శక్తి 29%, నాన్ వెజ్లో 18% పెరుగుదల
రేట్లు తగ్గడం వల్ల ఫ్యామిలీకి ఏటా రూ. 10వేల నుంచి 11వేల మిగులు

దేశంలో జనం కొనుగోలు శక్తిని కేంద్ర ప్రభుత్వం కొత్త విధానంలో లెక్కేసింది. భోజనం కోసం ఒక్కో కుటుంబం పెట్టే ఖర్చు ఆధారంగా ఎకనమిక్​ సర్వేలో విశ్లేషణ చేసింది.  2006–07 నుంచి 2019–20 మధ్య వెజ్​​ మీల్స్​ కొనుగోలు శక్తి 29 శాతం పెరిగిందని,  నాన్​ వెజ్​​ మీల్స్​కొనుగోలు శక్తి 18 శాతం పెరిగిందని వివరించింది. ‘థాలీనామిక్స్:  ది ఎకానమిక్స్​ ఆఫ్​ ఏ ప్లేట్​ ఆఫ్​ ఫుడ్​ ఇన్​ ఇండియా’ పేరిట ప్రత్యేకంగా 27 పేజీల చాప్టర్​ను చేర్చి.. 2019–20 ఆర్థిక సర్వేను శుక్రవారం పార్లమెంట్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టారు. చిన్న, మధ్యతరహా కంపెనీలకు మార్కెట్లను అందుబాటులోకి తేవడం, వ్యాపార అనుకూల విధానాలను అమలుచేయడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చీఫ్​
ఎకనమిక్ అడ్వైజర్​ కృష్ణమూర్తి సుబ్రమణియన్​ ఈ సర్వేను తయారు చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్​ 5గా ముగిసే అవకాశం ఉందని, వచ్చే ఫైనాన్స్​ ఇయర్​లో అది 6 నుంచి 6.5 శాతానికి చేరుకోవచ్చని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరి జీవితాలపై ఏదో విధంగా రోజూ ఎకానమీ ప్రభావం ఉంటుందని పేర్కొంది.

పెరిగిన కొనుగోలు శక్తి

భోజనాన్ని హిందీలో ‘థాలీ’ అంటారు. అందుకే ఎకనమిక్స్​ సర్వేలో ఆహార కొనుగోలు శక్తి చాప్టర్​కు ‘థాలీనామిక్స్​’ అని పేరుపెట్టారు. వెజ్​ థాలీలో తృణధాన్యాలు (అన్నం/రొట్టెలు), సబ్జీ (కూరగాయలు), పప్పు..  నాన్ వెజ్​ థాలీలో తృణధాన్యాలు, సబ్జీ, మాంసాహారాన్ని సర్వే పరిగణనలోకి తీసుకుంది.  దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 80 సెంటర్లలో పరిశ్రమల్లోని వర్కర్స్​ నుంచి డేటా సేకరించారు. 2006 ఏప్రిల్​ నుంచి 2019 అక్టోబర్.. అంటే 13 ఏండ్ల ఇండెక్స్​ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఐదుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు రెండు పూటలా భోజనానికి చేసే ఖర్చు, రోజువారీ ఆదాయం ఆధారంగా కొనుగోలు శక్తిని లెక్క గట్టారు. 2015–16 ఏడాది వరకు ఆహార ధాన్యాల రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉందని, ఆ తర్వాత తగ్గుతూ వచ్చిందని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ లెక్కన ఒక కుటుంబం ఏడాది కాలంలో భోజనంపై చేసే ఖర్చు 2015–16 తర్వాత కాలంలో బాగా తగ్గిందని ఎకనమిక్​ సర్వే తెలిపింది.  ఈ లెక్కన వెజ్​ మిల్స్​ తినే కుటుంబానికి ఏటా సగటున రూ.10,887 ఖర్చు తగ్గిందని లెక్కేసింది. అదే నాన్ వెజ్​ తినే ఫ్యామిలీకి సగటున రూ.11,787 మిగిలిందని వివరించింది. అదే సమయంలో రోజువారీ సగటు ఆదాయంలో భోజనానికి చేసే ఖర్చు ఆధారంగా 2006–07 నుంచి 2019–20  వరకు వెజ్​మీల్స్​ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 29శాతం పెరిగినట్లు అంచనా వేసింది. అదేవిధంగా నాన్​ వెజ్​ మీల్స్​ కుటుంబాల్లో కొనుగోలు శక్తి 18 శాతం పెరిగినట్లు లెక్కగట్టింది. ఇతర రంగాల్లోనూ ఇదే రీతిలో కొనుగోలు శక్తి ఉందని వివరించింది.

రాష్ట్రంలో ఫ్యామిలీ నాన్​వెజ్​ ఖర్చు రూ. 40.2

తెలంగాణలో ఐదుగురు సభ్యుల ఫ్యామిలీలో ఒక్కరి రోజు సగటు సంపాదన రూ. 479.6 ఉందని సర్వే పేర్కొంది. అందులో రూ. 40.2ను ఆ కుటుంబం సగటున రోజుకు నాన్​వెజ్​కి ఖర్చు చేస్తోందని తెలి పింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో  రోజువారీ సంపాదన ఎక్కువని విశ్లేషించింది.

‘బ్యాండ్​ బాజా బరాత్​’ ప్రస్తావన

రణ్​వీర్​సింగ్​, అనుష్క శర్మ  హీరో హీరోయిన్లుగా 2010లో విడుదలైన బాలీవుడ్​ సినిమా ‘బ్యాండ్​ బాజా బరాత్​’ను ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ సినిమాలో ఇద్దరూ ‘వెడ్డింగ్​ ప్లానింగ్​ బిజినెస్’​ను ప్రారంభిస్తారు. ఇలా కొత్త కొత్త ఐడియాలతో బిజినెస్​లు ప్రారంభించేందుకు యువ పారిశ్రామికవేత్తలు ఆసక్తి  చూపిస్తున్నారని, స్టార్టప్​ కంపెనీలకు మంచి అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఉపాధి కల్పనలో చైనా విధానాన్ని అనుసరించాలని సూచించింది. మేకిన్‌‌‌‌‌‌‌‌ ఇండియా కార్యక్రమం, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ డివైజ్‌‌‌‌‌‌‌‌ల ఎగుమతుల ద్వారా ప్రొడక్టులను ఇక్కడ అసెంబుల్‌‌‌‌‌‌‌‌ చేసి విదేశాలకు పంపించాలని, దానితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. 2025 నాటికి నాలుగు కోట్ల, 2030 నాటికి ఎనిమిది కోట్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 2024 వరకు ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.