ఇక జగన్ జీవితం జైలుకే.. బుద్ధా వెంకన్న

ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ ఇచ్చి వైసీపీని దారుణమైన దెబ్బ తీశారు.కూటమి శ్రేణులు విజయోత్సాహంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉందొ చూశారని, ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని అన్నారు. ఆరా మస్తాన్ ది కేవలం బెట్టింగుల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని అన్నారు. ప్రజావేదిక కూల్చివేత నుండి పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను కార్యకర్తలే తరిమికొట్టారని అన్నారు.

చంద్రబాబు కుటుంబంపై తప్పుడు విమర్శలు చేసినవారిని వదిలే ప్రసక్తి లేదని అన్నారు. చంద్రబాబుని రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఫినిష్ చేస్తానని అన్నారు. కానీ, భగవంతుడు వైఎస్ నే లేకుండా చేశాడని అన్నారు. జగన్ కూడా బాబుపై అనేక వ్యాఖ్యలు చేశాడని, ఇప్పుడు దేవుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడని అన్నారు. జగన్, కేటీఆర్ ఇద్దరు కలిసి పోటీ చేసినా లోకేష్ కు వచ్చిన మెజారిటీ రాదని అన్నారు. పవన్ పెళ్లిళ్లపై జగన్ కామెంట్ చేశాడని, ఇప్పుడు పవన్ రంకు మొగుడయ్యాడని అన్నారు.

జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే అని, ఇంక జగన్ జీవితం జైలుకేనని అన్నారు.జగన్ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయని అన్నారు.కానీ చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన ఈ కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదని అన్నారు .త్వరలోనే సజ్జల రామకృష్ణరెడ్డి కూడా జైలుకు వెళ్తాడని అన్నారు.2024 జూన్ 4 న తెలుగుదేశం పార్ 2 వచ్చింది. ఇప్పటి వరకూ ఉన్నది పార్ట్ 1. ఇంకో 45 సమవత్సరాలు టీడీపీ కి తిరుగు లేదని అన్నారు బుద్ధా వెంకన్న.