అప్పటివరకు ఫ్రెండ్స్తో సరదాగా ఉంది..ఇంతలోనే ఉరివేసుకొని..

  • గీతం యూనివర్సిటీలో స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌
  • హాస్టల్ రూమ్‌‌‌‌లో ఉరేసుకున్న యువతి

సంగారెడ్డి, వెలుగు: రుద్రారంలోని గీతం యూనివర్సిటీ హాస్టల్‌‌‌‌ రూమ్‌‌‌‌లో బీటెక్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పటాన్‌‌‌‌చెరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వర్ష (19) గీతం యూనివర్సిటీలో బీటెక్ సీఎస్‌‌‌‌ఈ సెకండ్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర వరకు రూమ్‌‌‌‌లోనే ఫ్రెండ్స్‌‌‌‌తో చదువుకుంది. 

తర్వాత ఫ్రెండ్స్‌‌‌‌ లంచ్‌‌‌‌ కోసం వెళ్లగా వర్ష మాత్రం రూమ్‌‌‌‌లోనే ఉండిపోయింది. సుమారు 40 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్‌‌‌‌ వచ్చి ఎంత సేపు డోర్‌‌‌‌ కొట్టినా తీయలేదు. అనుమానం వచ్చిన వర్ష ఫ్రెండ్స్‌‌‌‌ కాలేజీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్‌‌‌‌ను ఓపెన్‌‌‌‌ చేసి చూసేసరికి వర్ష ఉరివేసుకొని కనిపించింది. 

వెంటనే పటాన్‌‌‌‌చెరులోని ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనంతపురంలో ఉంటున్న వర్ష పేరెంట్స్‌‌‌‌కు సమాచారం ఇవ్వడంతో వారు రాత్రి హాస్పిటల్‌‌‌‌కు చేరుకున్నారు. వర్ష ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పటాన్‌‌‌‌చెరు సీఐ ప్రవీణ్‌‌‌‌రెడ్డి చెప్పారు. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.