ఉత్తరప్రదేశ్ : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు BSP అధినేత మాయావతి. ఇతర పార్టీలతో పొత్తు కోసం బీఎస్పీ చర్చలు జరుపుతోందన్న వార్తలను ఆమె ఖండించారు. పంజాబ్ మినహా వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరాఖండ్ లోను ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు మాయావతి. ఒకప్పుడు UPలో అధికారంలో ఉన్న బీఎస్పీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా మంది సీనియర్ నేతలు పార్టీని వదిలి పెట్టిపోయారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. అయితే ఇప్పటికీ దళితుల్లో బీఎస్పీకి పట్టు ఉంది. ఎంఐఎం పార్టీతో కలిసి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగుతోందని వార్తలు వచ్చాయి.
