- వచ్చే నెలలోనే రివైవల్ ప్లాన్
- త్వరలోనే 4జీ సేవలను ప్రారంభిస్తాం
- సీఎండీ పీకే పుర్వార్ ప్రకటన
న్యూఢిల్లీ:
ఆస్తులను అమ్మేస్తారు..
బీఎస్‌ఎన్‌ఎల్ రివైవల్ ప్లాన్‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) కసరత్తు చేస్తోంది. కంపెనీ ఆదాయంలో మెజారిటీ వాటా జీతభత్యాలకే ఖర్చవుతున్నందున ఉద్యోగులకు వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) అమలు చేయాలని ప్రతిపాదించింది. ఆదాయం పెంచుకోవడానికి ఆస్తులను అమ్మేయాలని సూచించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.70 వేల కోట్ల విలువైన భూములు, రూ.3,760 కోట్ల విలువైన భవనాలు ఉన్నాయి. వీఆర్‌ఎస్ ప్యాకేజీకి నిధుల కోసం రూ.6,365 కోట్లను నగదు, బాండ్లను రూపంలో సమకూర్చాలని డాట్ అనుకుంటోంది. ఈ సంస్థలో ప్రస్తుతం 1.76 లక్షల మంది పనిచేస్తున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు త్వరలో యుప్ టీవీ సేవలు
ట్రిపుల్ ప్లే సర్వీసుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ యుప్ టివి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పంద పత్రాలపై బీఎస్ఎన్ఎల్ సీఎండీ ప్రవీణ్ కుమార్ పూర్వార్ ,యుప్ టివి వ్యవస్థాపకులు,సీఈఓ ఉదయ్ రెడ్డి సంతకాలు చేశారు. దీంతో యుప్ టివి ద్వారా బీఎస్ఎన్ఎల్ మొబైల్,బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు వీడియో ఎంటర్టైన్మెంట్ సర్వీసులు చేరువ కానున్నాయి. రెండు వందలకు పైగా లైవ్ టీవీ చానెల్స్,పది రోజుల కాచ్ అప్ టీవీ,2500 పైగా సినిమాలు, ఫస్ట్ డే ఫస్ట్ షో,యుప్ టీవీ ఒరిజినల్స్,పదికి పైగా భాషల్లో అపరిమిత వీడియో ఎంటర్టైన్మెంట్ సర్వీసులను యుప్ టీవీ అందిస్తోంది.

