BSNL special Amarnath Yatra SIM:అమర్‌నాథ్ యాత్ర స్పెషల్ SIM: ధర, బెనిఫిట్స్, లభ్యత వివరాలివిగో 

BSNL special Amarnath Yatra SIM: అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకోసం BSNL ప్రత్యేక అమర్నాథ్ యాత్ర SIM కార్డును విడుదల చేసింది. భారత్ సంచార్ నిగమ్ నుంచి ఈ  4G సిమ్ కార్డును వినియోగదారులు పొందవచ్చు. ఈ సిమ్తో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తుంది.

అమర్నాధ్  యాత్ర 2024 జూన్ 29 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పవిత్ర యాత్ర ఆగస్టు 19, 2024 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో యాత్రికులు అమర్నాథ్ జీ బాబా బర్ఫానీని దర్శించుకుంటారు. ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ అయిన BSNL అమర్ నాథ్ యాత్రికులకోసం ప్రత్యేకంగా  సిమ్ కార్డును విడుదల చేరసింది. ఈ స్పెషల్ సిమ్ కార్డు తీర్థయాత్ర సమయంలో వినియోగదారులకు తమ కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. 

BSNL స్పెషట్ అమర్ నాథ్ యాత్ర సిమ్ 

అమర్ నాథ్ యాత్ర సమయంలో నిరంతరాయంగా నెట్ వర్క్ కవరేజీని అందించేందుకు BSNL హామీ ఇచ్చింది. BSNL యాత్ర SIM ధర రూ. 196. వినియోగదారులకు 4G సిమ్ కార్డు ఇస్తారు. కార్డు 10 రోజులు చెల్లుబాటు అవుతుంది. దీంతోపాటు అన్ లిమిటెడ్  వాయిస్ కాల్స్, డేటా బెనిఫిట్స్ ఇస్తుంది. 

SIM పొందడం ఎలా ? 

ట్రావెల్ సిమ్ కార్డ్ ని పొందేందుకు యాత్రికులు.. అమర్ నాథ్ యాత్ర స్లిప్ తోపాటు వారి ఆధార్ కార్డు లేదా KYC కోసం ఏదేని ఐడీ  కార్డును కలిగి ఉండాలి. ఇవి సమర్పిస్తే.. యాత్రికులు  యాక్టివ్ చేయబడిన BSNL SIM కార్డును పొందవచ్చు. యాత్రా మార్గంలో లఖన్ పూర్, భగవతి నగర్, చంద్రకోట్, వహల్గామ్, బల్తాల్, జమ్మూ, కాశ్మీర్ లోని ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో సిమ్ లభించడమే కాకుండా 10 రోజుల పాటు వారికి ఈ ప్రాంతాల్లో వాయిస్ కాలింగ్, డేటా సర్వీస్ ను అందిస్తుంది.