మార్కెట్లో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు మస్త్ క్రేజ్ ఉంది. కరోనా టైం నుంచి ఓటీటీ యూజర్లు పెరిగిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 249కే 8 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, ఆ సర్వీస్ ను కేవలం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్ కస్టమర్లు మాత్రమే పొందగలరు. ఈ ప్లాన్ తో జీ 5, సోనీ లివ్, వూట్ సెలెక్ట్, యప్ టీవీ, అహా, లయన్స్‌గేట్ ప్లే, హంగామా, డిస్నీ+ హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
