అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలంలో దారుణం జరిగింది. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) కాంట్రాక్టు ఉద్యోగిని. యథావిధిగానే నిన్న(మంగళవారం) ఉదయం బ్యాంక్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి దగ్గర స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కుమార్తెను హత్య చేశారని స్నేహలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించారని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు విచారణ చేపట్టారు.
