పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి డ్రోన్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పెట్రోలింగ్ లో ఉన్న BSF సిబ్బంది డ్రోన్ ను గుర్తించి.. 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో వెంటనే ఆ డ్రోన్ తిరిగి పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిందని తెలిపారు BSF అధికారులు. అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్ ను సీజ్ చేశారు BSF అధికారులు. పంజాబ్ ఫిరోజ్ పూర్ సరిహద్దులో తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్ ను BSF దళాలు పట్టుకున్నాయి. డ్రోన్ ను చైనాలో తయారు చేసినట్టు గుర్తించారు. గతంలో జమ్మూకశ్మీర్ సరిహద్దుకు పాకిస్థాన్ నుంచి డ్రోన్లు వచ్చాయి. అక్కడ నిఘా పెరగడంతో పాకిస్థాన్ ఇప్పుడు పంజాబ్ బార్డర్ కు డ్రోన్లు పంపిస్తున్నట్టు అనుమానిస్తున్నాయి BSF వర్గాలు. సరిహద్దు వెంబడి భద్రతను టైట్ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం
ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్ సభ ఆమోదం
