ఇండో-పాక్ బార్డర్‌‌‌లో ఆయుధాలు.. బీఎస్‌‌ఎఫ్ స్వాధీనం

ఇండో-పాక్ బార్డర్‌‌‌లో ఆయుధాలు.. బీఎస్‌‌ఎఫ్ స్వాధీనం

బఠిండా: సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌‌ఎఫ్) జవాన్లు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు ఎమ్-16 రైఫిల్స్ ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రం, ఫిరోజ్‌‌‌పూర్ జిల్లాలోని జోగిందర్ చౌక్‌‌కు సమీపంలో వెపన్స్‌‌ను జవాన్లు రికవర్ చేశారు. ఈ ప్రాంతం జీరో లైన్‌‌‌కు పక్కనే ఉందని తెలుస్తోంది. మూడు ఏకే-47 రైఫిళ్లు, 6 మేగజీన్స్, 91 రౌండ్లు, నాలుగు మేగజీన్స్, 57 రౌండ్లు, రెండు చైనీస్ పిస్టళ్లు, మరో నాలుగు మేగజీన్స్, 20 రౌండ్లను ఇండో-పాక్ బార్డర్‌‌‌లో స్వాధీనం చేసుకున్నామని ఒక బీఎస్‌‌ఎఫ్ అధికారి తెలిపారు. ‘ప్లాస్టిక్ బ్యాగులో ప్యాక్ చేసి ఉన్న ఆయుధాలను గుర్తించాం. ఆ ఏరియాలోని పలు స్పాట్స్ నుంచి వెపన్స్‌‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌‌‌ఐఆర్‌‌‌లో ఎవరి పేరునూ చేర్చలేదు. విచారణ కొనసాగుతోంది’ అని లఖో కే బెహ్రామ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బీర్బల్ సింగ్ తెలిపారు.