పాక్ డ్రోన్​ను కూల్చేసిన బీఎస్ఎఫ్​ జవాన్లు

పాక్ డ్రోన్​ను కూల్చేసిన బీఎస్ఎఫ్​ జవాన్లు
  • పాక్ డ్రోన్​ను కూల్చేసిన బీఎస్ఎఫ్​ జవాన్లు

ఫిరోజ్ పూర్: ఇండియాలోకి అక్రమం గా ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్​ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్​ఎఫ్)​ బలగాలు శుక్రవారం కూల్చేశాయి. బీఎస్ఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. ఫిరోజ్ పూర్ జిల్లాలోని మాబోక్ గ్రామ సమీపంలో బీఎస్ఎఫ్​ దళాలు డిసెంబర్ 8న రాత్రి 10 గంటలకు డ్రోన్ కదలికలను గుర్తించాయి. అప్రమత్తమైన ​జవాన్లు దానిని  కూల్చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9న ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా రోహిల్లా హాజిల్లా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఓ చిన్న డ్రోన్ లభించింది.

రికవరీ చేసు కున్న డ్రోన్​ను క్వాడ్ కాప్టర్ మోడల్​గా బీఎస్ఎఫ్  జవాన్లు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా పాక్​ సరిహద్దు నుంచి ఇండియాలోకి అక్రమంగా డ్రోన్ల సహాయంతో ఆయుధాలు, నార్కొటిక్స్ ను  స్మగ్లింగ్ చేస్తున్నారు. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది.