GOOD NEWS: బీఎస్‌‌ఎఫ్‌‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆన్ లైన్ లో దరఖాస్తు ఇలా

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్​ఎఫ్​) స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్- సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్‌‌ 30వ తేదీలోగా ఆన్‌‌లైన్​లో అప్లై చేసుకోవాలి. 

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్‌‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌‌బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌, వాటర్‌‌ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్.

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నేషనల్‌‌/ ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్స్‌‌లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి లేదా విజయాలు సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 
సెలెక్షన్​: అప్లికేషన్స్‌‌ షార్ట్‌‌లిస్టింగ్‌‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులు: ఆన్​లైన్​లో డిసెంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు  www.rectt.bsf.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.