గనుల వేలంపై మౌనమెందుకు?: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం సింగరేణి సంస్థకు నేరుగా కేటాయించాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్పందించక పోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు.

ఈ మేరకు శుక్రవారం కేటీఆర్​ ఓ ప్రకటన విడుదల చేశారు.  రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఉప ముఖ్యమంత్రిని పంపించి మరీ సింగరేణి గనుల వేలంలో పాల్గొనడం.. ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీ అవకాశవాదాన్ని తలపిస్తోందని ఆయన విమర్శించారు. గనుల వేలం విషయంలో మారిన తమ వైఖరిపై ఉన్న ఒత్తిళ్లు ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ గనుల వేలం ద్వారా అంతిమంగా సింగరేణి సంస్థ మొత్తం ప్రైవేట్ పరం అవుతుందని, పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తుందనే అంశాన్ని రేవంత్ రెడ్డి అంగీకరిస్తారో? లేదో? తెలపాలన్నారు. గనుల వేలం పాట కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి,  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనడం పైన కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

గనుల వేలమంటే సింగరేణికి ఉరేయడమే: జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

బొగ్గు గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేలం వేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమంటే సింగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేణికి ఉరి వేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మే అని ఎమ్మెల్యే జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాలపై కాంగ్రెస్, బీజేపీ నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సోయి లేదని విమర్శించారు. తెలంగాణ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీశ్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సింగరేణిపై కేటీఆర్ మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం మేల్కొన్నదన్నారు. బొగ్గు గనుల వేలంపై  తమ వైఖరేంటో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.